ఢిల్లీలో చంద్రబాబును కలిసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • ఏపీ భవన్ కు వెళ్లిన విష్ణుకుమార్ రాజు
  • వ్యక్తిగత పని నమిత్తం ఇక్కడికి వచ్చా
  • బాబు ఇక్కడే ఉన్నారని తెలిసి గౌరవార్ధం కలిశా
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీయేతర పక్షాలను ఒక్కతాటిపైకి చంద్రబాబు తీసుకొస్తున్నారు. ఢిల్లీలో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా, ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏపీ భవన్ లో చంద్రబాబును బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కలిశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజును  మీడియా పలకరించింది. తన వ్యక్తిగత పని నిమిత్తం ఇక్కడికి వచ్చానని, చంద్రబాబు ఇక్కడే ఉండటంతో ఆయన్ని కలిసి వెళ్దామని అనుకున్నానని అన్నారు. అంతేతప్ప, చంద్రబాబును కలవడం వెనుక ఎటువంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.

‘బీజేపీయేతర పక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్న పక్షంలో ఆయన్ని మీరు కలవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి?’ అనే ప్రశ్నపై విష్షుకుమార్ రాజు స్పందిస్తూ, ఓ ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు బాబుతో కలిసి పనిచేశాను కనుక గౌరవార్ధం ఆయన్ని కలిశానని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
Chandrababu
cm
Telugudesam
Vishnukumar raju
bjp

More Telugu News